Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 4:22 pm Posted by : ramakrishna

సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ

రుద్రూర్, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసి, కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు సోమవారం సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కార్మిక కోడ్ లతో కష్టజీవులు కష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ఆవిష్కరణలో సీఐటీయూ నాయకుడు నన్నేసాబ్, అంగన్ వాడీ యూనియన్ నాయకురాలు గంగామణి, ఆశా యూనియన్ నాయకులు భూలక్ష్మి, వాణి, లతా, పుష్ప తదితరులు పాల్గొన్నారు.