అకాల వర్షం.. అపార నష్టం..
బతుకమ్మ,మోర్తాడ్: ఆరుకాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందు కనబడడంతో సంతోషపడ్డ రైతు కళ్ళల్లో దుఃఖమే మిగిలింది. చేతికొచ్చిన పంట చూసుకొని రైతు ఆశలతో కానీ అ కాలంలో వచ్చిన వర్షం, ఈదురు గాలుల వల్ల చేతికొచ్చిన వరి పంట నేల వాలిపోయి అపార నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ధోన్ పాల్ , భీంగల్ మండలంలోని దేవక్కపేట్ తదితర గ్రామాలలో వరి పంట నేల వాలిపోయింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతుల కోరుతున్నారు.