Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 4:52 pm Posted by : ramakrishna

ఆశలు తడిపేసిన అకాల వర్షం

మోర్తాడ్, బతుకమ్మ: ఆరుకాలం కష్టపడి పండించిన పంటను నూర్పిడి చేసి ఆరబోశారు రైతులు. ధాన్యం ఆరిన వెంటనే అమ్మితే వచ్చిన డబ్బులతో ఖరీఫ్ పంటల పెట్టుబడులు పెట్టవచ్చని ఎంతో ఆశతో ఉన్న రైతన్న ఆశలను అకాల వర్షం రూపంలో వచ్చి ఆశలను తడిపేసిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్, మెండోరా, ముప్కాల్ తదితర మండలాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి రోడ్లపై కళ్ళల్లో ఆరబోసిన పంటలు తడిసిపోవడంతో పంటకు మద్దతు ధర రాదని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Untimely rain dampens hopes