మెగా క్యాంప్ కు అపూర్వ స్పందన

వందల మందికి ఉచిత వైద్యం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమని నుడా చైర్మన్ కేశ వేణు  సూచించారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని  వైద్యుల సూచనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు  రామర్తి గోపి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘంలో ఆదివారం నిర్వహించిన   ఈ మెగా వైద్య శిబిరానికి  స్థానికంగా  అనుహ్య స్పందన లభించింది.మెగా వైద్య శిబిరాన్ని ...