Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 4:21 pm Posted by : ramakrishna

గుర్తు తెలియని వ్యక్తి  మృతి

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ – బి చౌరస్తా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని బాల్కొండ ఎస్సై నరేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఇతను భిక్షాటన చేస్తూ జీవించేవాడని అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు. ఎవరైనా ఇతనిని గుర్తు పడితే బాల్కొండ పోలీస్ స్టేషన్ కు 8712659860 నెంబర్ కు సమాచారం అందివ్వగలరని ఎస్సై కోరారు.