Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 4:21 pm Posted by : ramakrishna

ఫ్లెక్సీ చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు

. . . దుండగులను పట్టుకోవాలంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా

 

కోటగిరి, బతుకమ్మ :

 

పోతంగల్ మండలం హంగార్గ గ్రామంలో ఇటీవల ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిరడి ఉదయ్ భాస్కర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నీ మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కావాలనే కొందరు వ్యక్తులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై సునీల్ కాంగ్రెస్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. వెంటనే ఎంక్వయిరీ చేసి దోషులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించిన కాంగ్రెస్ నాయకులు తమ ఆందోళనలను విరమించుకున్నారు.

 

Unknown people tore the flexi
Unknown people tore the flexi