. . . కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి
భిక్కనూరు, బతుకమ్మ
విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆదర్శంగా ఉండాలే కాని లేనిపోని గొడవల్లో తలదూర్చి కేసుల పాలు కావద్దని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం భిక్కనూరు మండలంలోని బేసిక్స్ వద్ద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు రాగింగ్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ క్యాంపస్ లో విద్యార్థులు జూనియర్ సీనియర్ తేడా లేకుండా ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్ప వన్నారు. రాగింగ్ పేరుతో గొడవలకు లేనిపోని చిన్నచిన్న విషయాలకు తగాదాలు పెట్టుకోవడం కారణంగా కేసులపాలై ఉద్యోగాలకు దూరం కావలసి వస్తుందని సూచించారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఒక లక్ష్యంతో బాగా చదివి విద్యార్థులు ఉన్న స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్, విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
