మోర్తాడ్, బతుకమ్మ :
సేంద్రియ వ్యవసాయం ద్వారా అనేక లాభాలు కలుగుతాయని సేంద్రియ వ్యవసాయ దారుడు అశోక్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు మహేందర్ సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న మొక్కజొన్న, పసుపు, వరి తదితర పంటలను మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో ఆయన శుక్రవారం పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో గల మెలకువలను, కలిగే లాభాలను రైతును అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ ఎరువులను ఏ విధంగా సహజసిద్ధంగా తయారు చేయాలో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గోలి సందీప్ తదితరులు పాల్గొన్నారు.