కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి యూనివర్సిటీ జేఏసీ మద్దతు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో శనివారం యునివర్సిటీ లోని వివిధ సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వచించారు. ఈ కార్యక్రమంలో వారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్-మెదక్-అదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల కోసం మరో యుద్ధం చేసి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో...