Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 4:58 pm Posted by : ramakrishna

యూనివర్సిటీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

 

. . .  చీఫ్ వార్డెన్ కి తే. యూ పి డి ఎస్ యు  వినతి

 డిచ్ పల్లి, బతుకమ్మ :

తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చీఫ్ వార్డెన్ కి తే.యూ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి కే.గౌతం రాజు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న హాస్టల్ , రూమ్ లు సరిగ్గా క్లీన్ చేయడం లేదని దుర్వాసన వస్తుంది , రుచికరమైన వంటలు చేయడం లేదని సమయానికి రావడం లేదు కావున వెంటనే వారిని మార్చాలని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,అశుభ్రమైన చికెన్ తీసుకువచ్చి వండుతున్నారు,కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేయాలని, ఉదయం టిఫిన్ సమయానికి అందించాలని కోరారు.హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి డి ఎస్ యు నాయకులు తిరుపతి, రాజేందర్,రుషేందర్, మణికాంత్ తదితరులు పాల్గొన్నారు.