బీసీ బంద్ కు సర్వత్ర మద్దతు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బీసీ బంద్ కు మద్దతు గా శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అన్ని యూనియన్లు, జర్నలిస్టులు పూర్తి మద్దతును తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రం బీసీ బంద్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీలకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతుందని, బీసీ లకు న్యాయం చేయుటకు నేటికైనా బీసీ లందరికీ 42% రిజర్వేషన్ కల్పించుటకు పోరాటం చేయడం...