Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 4:58 pm Posted by : ramakrishna

మేరా యువ భారత్ ఇందూరు ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  “ఏక్ భారత్ – ఆత్మనిర్భార్ భారత్ ” సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా  మేరా యువ భారత్ ఇందూరు ఆధ్వర్యంలో వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్య ధన్ పాల్ సూర్యనారయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు మనం దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంవత్సర వ్యాప్తంగా వారి 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ కోసం ఒకచోట చేరడం ఎంతో గర్వకారణం అన్నారు. సర్దార్ పటేల్ మన స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడు అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి, భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం ఆయన చేసిన అపూర్వ సాహసం. అందుకే ఆయనను “భారత ఐక్యతకు ప్రతీక”గా ప్రపంచం గుర్తిస్తుందని అన్నారు. మన యువత ఈ మహనీయుని ఆలోచనలను, ప్రేరణను తమ జీవితంలో కలుపుకోవాలి. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ఈరోజు మనందరికీ అత్యంత అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి,మేరా యువ భారత్ జిల్లా అధికారి షైలా బెలాల్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు,  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ , పోతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Unity March under the auspices of Mera Yuva Bharat Indore