Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 6:14 pm Posted by : ramakrishna

ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత

 

. . . రథయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇస్కాన్ చేపడుతున్న కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాధుని రథయాత్రను శుక్రవారం నగరంలోని గంజి కమాన్ వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా నిజామాబాద్ ఇస్కాన్ నగరంలో రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. వారం రోజులపాటు జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరామకృష్ణుడి ప్రతిమల మండపాన్ని ఏర్పాటు చేసి పూజించడం సంతోషకరమన్నారు. ప్రతి సంవత్సరం ఇస్కాన్ సేవలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల బోధన్ లో ఇస్కాన్ ఆలయాన్ని నిర్మించడానికి స్థల సేకరణ జరిగిందని గుర్తు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోనూ పెద్ద ఆలయం నిర్మించేలా కృషి చేయాలన్నారు.  హనుమాన్ జయంతి గణేష్ నిమజ్జనం తర్వాత ఇస్కాన్ రథయాత్రకు ఆదరణ పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షులు సిద్ధ బలరామయ్య, కార్పొరేటర్ లు బంటు ప్రీతి, నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, పసునూరి రాము, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

 

Unity among Hindus with ISKCON programs
Unity among Hindus with ISKCON programs