Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 9:34 pm Posted by : ramakrishna

హిందువుల్లో ఐక్యత పెరగాలి

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హిందువుల్లో ఐక్యత పెరగాలని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లో మంగళ వారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హిందువుల్లో ఇప్పటికీ చిన్న చిన్న భేద తారతమ్యాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా దూరం చేయాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్ ఎస్ ఎస్ నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలకు అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సమ్మేళనంలో సంఘ్ నుంచి వక్తలు చెబుతున్న మాటలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. భవిష్యత్తు తరాలకు హిందూ సంస్కృతి సంప్రదాయాలను అందించాలని, ఇది అందరి భాధ్యత అన్నారు. కార్యక్రమంలో వక్త, ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి అప్పాల ప్రసాద్, కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Unity among Hindus should increase.