Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 3:40 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో కేంద్ర మంత్రి పర్యటన

కామారెడ్డి, బతుకమ్మ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. బీజేపీ సభ్యత్వ నమోదు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని నాయకులతో కలిసి ఆయన రోడ్లను శుభ్రం చేశారు. సుభాష్ రోడ్డు, తిలక్ రోడ్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదులో పాల్గొన్న అనంతరం మధ్యాహ్న కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార, మురళీధర్ గౌడ్, బీబీ పాటిల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Union Minister's visit to Kamareddy