ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను ఆపాలి
పర్యావరణాన్ని నాశనం చేయవద్దని సూచన
వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయవొద్దన్నారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయవద్దని సూచించారు. 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కిషన్ రెడ్డి సూచించారు. జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చొద్దన్నారు.