Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 6:07 pm Posted by : ramakrishna

కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలి

 రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్

బాన్సువాడ, బతుకమ్మ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగంతో దిక్సూచిని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ పై కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అమీత్ షా దళిత వర్గాల మనోభావాలను దెబ్బతీసినందుకు కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడమే కాకుండా బిజెపి పార్టీ నుండి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో మైనారిటీ జిల్లా అధ్యక్షులుఖలేఖ్ , మున్సిపల్ ఛైర్మెన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, అలీమొద్దీన్ బాబా ,షాహబ్ , శ్రవణ్ , అజీమ్ ,అఫ్రోజ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.