ఈత చెట్లు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం రాణంపల్లి శివారులోని చింత చెరువు కట్ట దగ్గర నాటిన ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో 60 ఈత చెట్లను నాటారు. నాటిన ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈత చెట్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.