నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై టౌన్–1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది గమనించారు....