బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి
బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని అడ్డా కూలీ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. బోధన్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… సాలంపాడ్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం బోధన్ కూలీల అడ్డా నుంచి ఓ కూలీని తీసుకెళ్లి సాలంపాడ్‌లో తన పని చేయించుకున్నాడు. పని పూర్తయ్యాక సాయంత్రం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న కూలీ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు....