Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:22 pm Posted by : ramakrishna

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని అడ్డా కూలీ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. బోధన్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… సాలంపాడ్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం బోధన్ కూలీల అడ్డా నుంచి ఓ కూలీని తీసుకెళ్లి సాలంపాడ్‌లో తన పని చేయించుకున్నాడు. పని పూర్తయ్యాక సాయంత్రం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న కూలీ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు పని కోసం వచ్చినప్పుడు తన పేరు నాని, తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడినని చెప్పినట్లు సమాచారం. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే బోధన్ రూరల్ ఎస్సై – 8712659872 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని రూరల్ పోలీసులు కోరారు.

 

 

Unidentified labourer dies in Bodhan Rural Police Station limits