Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 7:03 pm Posted by : ramakrishna

గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం

బతుకమ్మ,మాక్లూర్ : మాక్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామ శివారు ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కన చనిపోయి ఉన్న గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్టు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం సుమారు మహిళా వయసు 60 సంవత్సరాలు ఉండొచ్చని మహిళా ఎలా చనిపోయింది ఎవరు అనే వివరాలు తెలిసి రాలేదని తెలిపారు. మృతురాలు వివరాలు తెలిసిన వారు స్థానిక మాక్లూర్ పోలీస్ స్టేషన్ నెంబర్  8712659846  సమాచారం ఇవ్వాలని స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు.