గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని శంభుని ఆలయ ప్రాంతంలో ఉన్న ముస్కాన్ కలెక్షన్స్ ఎదుట ఈనెల 2వ తేదీన అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు వృద్ధురాలు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.