కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పురుషుడి శవం కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడి వయస్సు సుమారుగా 55 నుండి 60 సంవత్సరాల మధ్యగా ఉండవచ్చని తెలిపారు. మృతుడి వద్ద జగ్గర్ టైలర్ కుట్టిన బట్టలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమికంగా మృతుడు నిజామాబాద్ జిల్లా లేదా నందిపేట్ మండలానికి చెందినవాడై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడిని గుర్తించే వారు, లేదా సమాచారం తెలిసిన వారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను వెంటనే సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
