కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతుడి ఎడమ చేతిపై “చెంచమ్మ” అనే పేరుతో టాటూ ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి ఆచూకీ కోసం పోలీసులు...