అశోక్ సాగర్ లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఎడపల్లి, బతుకమ్మ :నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపే ట్ శివారులోని అశోక్ సాగర్ చెరువు తూము వద్ద సోమవారం గుర్తు తెలియని మగ మృతదేహం పోలీసులకు లభ్యమైంది.ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...అశోక్ సాగర్ చెరువు తూము వద్దకు గుర్తు తెలియని శవము (45) కొట్టుకువచ్చిందని ఆ గ్రామానికి చెందిన గుంజ శ్రీనివాస్ ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వేంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...