Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 10:32 pm Posted by : ramakrishna

అశోక్ సాగర్ లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ఎడపల్లి, బతుకమ్మ :నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపే ట్ శివారులోని అశోక్ సాగర్ చెరువు తూము వద్ద సోమవారం గుర్తు తెలియని మగ మృతదేహం పోలీసులకు లభ్యమైంది.ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…అశోక్ సాగర్ చెరువు తూము వద్దకు గుర్తు తెలియని శవము (45) కొట్టుకువచ్చిందని ఆ గ్రామానికి చెందిన గుంజ శ్రీనివాస్ ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వేంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గుంజ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు 5.అడుగుల 7 ఇంచుల పొడవు ఉంటా డని,నీలి కలర్ లుంగీ, తెల్లని బనియన్, ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బోధన్ మార్చు రిలో భద్రపరచడం జరిగింది అని,ఎవరైకైనా వ్యక్తి ఆచూకీ,దుస్తుల గుర్తులతో తెలిసినట్లయితే ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు 8712659873 లేదా 8712659780 నంబరు కి పోన్ చేయాలని ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి సూచించారు.