నందిపేట్, బతుకమ్మ : నందిపేట్- బజార్ కొత్తూరు గ్రామ శివారులోని కుంట ముందర గల పోలాసా వాణి ప్రసాద్, వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మృత దేహం ఉన్నట్లు నందిపేట్ పోలీసులకు సమాచారం వచ్చింది.ఈమేరకు ఎస్ఐ శ్యామ్ రాజ్ సంఘటన స్థలానికి చేరుకొని కుళ్లిన స్థితిలో వున్నా సుమారు 35 -40 సంవత్సరాలు గల పురుష వ్యక్తి అనారోగ్యంతో కానీ మరి ఇతర కారణాలు వల్ల చనిపోయి ఉండవచ్చని తెలిపారు. మృతునిపై బ్లూ, రెడ్,వైట్ కలర్ గడుల షర్టు ధరించి కలదని, దానిపై మాచర్ల ముత్యం ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. మృత దేహాన్ని గుర్తిస్తే నందిపేట్ పోలీసుల సెల్ నెంబర్ 87 126 59861, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సెల్ నెంబర్ 8712659859 సమాచారం ఇవ్వాలని కోరారు.