Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 2:35 pm Posted by : ramakrishna

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మెండోరా, బతుకమ్మ: గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు మెండోరా ఎస్సై సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం వెల్గటూర్ శివారులోని బట్టపూర్ బ్రిడ్జి కింద పెద్దవాగు లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు పేర్కొన్నారు.  యస్సు సుమారు 65 సంవత్సరాలు ఉండి, తెలుపు రంగు చాయ, మెడలో నీలిరంగు కండువా, కుడి చేతికి పచ్చబొట్టు, కుడి చేతి ఉంగరపు వేలుకి రాగి ఉంగరం,తెల్లటి ప్యాంటు షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు మెండోరా ఎస్సై 8712659864, ఆర్మూర్ రూరల్ సీఐ 8712659859 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

Unidentified body found