Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 6:46 pm Posted by : ramakrishna

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి న్యాల్కల్ రోడ్ లోని హెచ్‌డి‌ఎఫ్‌సి ఏటిఎం పక్కన గల కల్లు బట్టి దగ్గర గల మోరీ(నాలా) వద్ద గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేని స్థితిలో ఉండగా అతన్ని 108 అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగ ఆదివారం మద్యాహ్నం అతను చనిపోయినట్టు ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. అట్టి మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.  మృత దేహాన్ని పరిశీలించి చూడగా అతని మీద లేత ఆరెంజ్ రంగు కలర్ ఫుల్ షర్ట్, ముదురు నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వయసు సుమారు 60 నుండి 65 వరకు ఉంటుంది.  అతని దగ్గర ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై 5 వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసినవారు 5 వ  టౌన్ పోలీస్ స్టేషన్ లేదా ఫోన్ నెంబర్: 8712659844 సంప్రదించాలని ఎస్ఐ ఎం.గంగాదర్ తెలిపారు.