- గంజాయి,ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవు
- టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీకాంత్..
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలో ఉన్న ఉన్న పాన్ షాపులలో,కిరాణా షాప్ లలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీస్ నార్కోటిక్ జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఎస్.ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు అనర్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందువలన పట్టణ పరిధిలో ఉన్న పాన్ షాప్ లలో గంజాయి పదార్థాలను గుర్తించే జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని,జిల్లాలో గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద,పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
