భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ వెబ్ న్యూస్, బతుకమ్మ : భారతీయ సంస్కృతి వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్య శాస్త్రం యునెస్కో మెమరీ  ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈవిషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ’ఎక్స్‘ వేదికగా తెలిపారు.  ఈవిషయమై ప్రధాని మోదీ హర్షం వ్య క్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. ఇది మన జ్ఞాన సంపద, సంస్కతికి లభించిన ఘనమైన గుర్తింపు అన్నారు.