వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై అవగాహన
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రం లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పై మంగళవారం బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ చట్టం పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేసి ప్రజలను ముఖ్యంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతి గ్రామంలో ముస్లిం సోదరులకు వక్ఫ్ బోర్డు స్వర్ణ చట్టంపై అవగాహన కల్పించాలని బిజెపి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ...