Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 3:29 pm Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు పోలీస్ స్టేషన్ నిర్వహణ పనితీరు అంశాన్ని విద్యార్థులకు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును,పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించారు. విద్యార్థులకు డయల్ 100,షీ టీమ్,సైబర్ క్రైమ్,ఆయుధాల పనితీరు,వీహెచ్ఎఫ్ సెట్ వినియోగం గురించి అవగాహన కల్పించారు.తదనంతరం విద్యార్థులు ఎస్ఐతో ముఖాముఖి నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాల గురించి, చదువు ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Understanding of Police Station Management