మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై అవగాహన
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. వీబీ జీ రామ్ జీను తక్షణమే రద్దు చేయాలని...