సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన
బతుకమ్మ, నందిపేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి డొంకేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం తొండకూర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి ప్రజలకు వున్న అపోహలు తొలగించారు . ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సంబంధిత వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయి కాబట్టి, సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, వివిధ పథకాలు అందించాలన్న సంకల్పం...