Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 6:54 pm Posted by : ramakrishna

సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన 

బతుకమ్మ, నందిపేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి డొంకేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం తొండకూర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి ప్రజలకు వున్న అపోహలు తొలగించారు . ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సంబంధిత వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయి కాబట్టి, సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు,  వివిధ పథకాలు అందించాలన్న సంకల్పం తో ఉందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు సర్వే అధికారులకు తన కుటుంబ వివరాలు అందించి సర్వేను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. గంగాధర్, మైనారిటీ మండల అధ్యక్షులు డాక్టర్ ఫరీద్, మాజీ సర్పంచ్ దశ గౌడ్, జెల్ల రాజన్న, బోదాసు గంగాధర్, జంగం లింగం, మల్కన, బద్దన్న గంగారాం మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.