కిషన్ క్రెడిట్ కార్డు పై అవగాహన

మెండోరా, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల గంగపుత్ర పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకు కిషన్ క్రెడిట్ కార్డ్ పై జిల్లా అధికారి ఏడి ఆంజనేయ స్వామి అవగాహన కల్పించారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల ఫిషరీస్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  కార్యక్రమంలో గంగపుత్ర సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.