- రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల డిమాండ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలని రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తలు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం పక్షాన శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. తాళ్లరాంపూర్లో గౌడ గీతా కుటుంబాలను వీడీసీలు సాంఘిక బహిష్కరణ, మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరచడం ఈత వనాన్ని తగలబెట్టడం లాంటి అటవీక, అనాగరిక చర్యల పూనుకున్న విడీసీలను నిషేదించాలని బాద్యులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే బడుగు బలహీన వర్గాలపై వీడీసీల ఆగడాలు అరాచకాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. గ్రామపంచాయతీలు కాకుండా గ్రామ అభివృద్ధి కమిటీలే అక్కడ వారు చెప్పిందే వేదం శాసనంల చలామణి అవుతుందని వినకుంటే సాంఘిక బహిష్కరణ చేయడం జరిమానాలు విధించడం హుకుం జారీ చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారని తెలిపారు. అలాంటి విడీసీలను పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లరాంపూర్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వెళ్లిన ఇంతవరకు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని, ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి అని అన్నారు. తక్షణమే వీడీసీ లను రద్దు చేయాలని, భాద్యులను అరెస్ట్ చేయాలని, ఈత వనం నష్ట పరియారం కట్టిచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాళ్లరాంపూర్ పోరాటాన్ని ఉద్రతం చేస్తామన్నారు. ఈ నెల 25 న చలో తాళ్లరాంపూర్ పేరుతో అర్మూర్ ఆర్ఢీఓ ఆఫీసు ముందు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి, కుల బీసీ, ఎస్సీ సంఘాలు జయప్రదం చేయాలని తాళ్లరాంపూర్ పోరాట జేఏసీ పిలుపు ఇచ్చింది. ఈకార్యక్రమానికి పెద్ది వెంకటరాంలు అధ్యక్షత వహించగా సీపీఎం రమేష్ బాబు, నూరుజహాన్, సీపీఎంఎల్ నాయకులు ప్రభాకర్, సుధాకర్,గీత పనివారుల సంఘము విట్టల్ గౌడ్, జానవిజ్ఞాన వేదిక నర్రా రామారావు,బీసీ నాయకులు బాస రాజేశ్వర్,మాజీ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, బుస్సాశంకర్, పౌర, మానవ హక్కుల నాయకులు అల్గొట్ రవీందర్, ధర్మేందర్,చంద్రశేఖర్ సాయికుమార్, మాయావర్ రాజేశ్వర్, పద్మ, శ్యామ్, నీరడి లక్ష్మణ్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు కోయేడి నర్సింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, శేకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.