- నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డబ్బుల కోసం మేనకోడల్ని హతమార్చిన మామను నవీపేట్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన బుధవారం వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బుధవారం వెల్లడించారు. మోస్రా గ్రామానికి చెందిన పాండవల సాగర్ తన ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం కాగా , డబ్బుల కోసం ఈనెల 24 న మల్కాపూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడ తన మేనకోడలు ఆకుల అనంత ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన మేనకోడలు ఒంటరిగా ఉండడంతో వెంటనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని పారిపోయాడు. వాటిలో కొంత బంగారాన్ని బోధనలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి వెళ్లిపోయాడు. హత్య కేసుగా నమోదు చేసుకున్న నవీపేట్ పోలీసులు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం నిజామాబాద్ బస్టాండ్ వద్ద సాగర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. నిందితుడు వద్ద కొంత బంగారాన్ని, మొబైల్ ఫోను ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన నవీపేట్ ఎస్సై లు తిరుపతి, యాదగిరి గౌడ్, పోలీసులను ఏసిపి రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.