Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 7:34 pm Posted by : ramakrishna

అనుమతి లేని శ్రీచైతన్య పాఠశాల సీజ్

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాలను మండల విద్యాధికారి నాగేశ్వరరావు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సూచనల మేరకు విద్యాశాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మూసివేసినట్లు తెలిపారు. తదుపరి అనుమతులు వచ్చే వరకు పాఠశాలలో తరగతులు నిర్వహించవద్దని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.