Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 6:20 pm Posted by : ramakrishna

అనుమతుల్లేని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సీజ్

. . . అర్హతలేని వైద్యం

 

. . . ప్రజల ప్రాణాలతో చెలగాటం

 

బోధన్, బతుకమ్మ :

 

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కుమ్మన్‌పల్లి డి.ఎన్. రెడ్డి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ రాజశ్రీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. క్లినిక్‌ను అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గుర్తించిన అధికారులు, నిబంధనలు అతిక్రమిస్తూ అక్రమంగా వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన అర్హత గల వైద్యుల వద్దనే చికిత్స పొందాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సమత,బోధన్ సీఐ వెంకటనారాయణ, నిర్మల, రవి, వేణు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Unauthorized first aid center seized
Unauthorized first aid center seized
Unauthorized first aid center seized
Unauthorized first aid center seized