Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2024, 12:24 am Posted by : ramakrishna

 డైట్ కాలేజీలో అడ్డగోలు అనధికార డిప్యూటేషన్ లు

  •   అనర్హులకు   డిప్యూటేషన్ లు
  •  కామారెడ్డి నుంచి  డైట్ కు డిప్యూటేషన్ రాత్రికి రాత్రే రద్దు

 నిజామాబాద్, బతుకమ్మ  : ఉపాధ్యాయులను తయారు చేసే డైట్ కళాశాలలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఎక్కడ లేని విధంగా అధికార యంత్రాంగం అనుమతులు లేకుండా అనాధికార డిప్యూటేషన్ లు ఇస్తున్నారు. అదికూడా అనర్హులకు  ఈ వ్యవహరం విద్యాశాఖలో రచ్చ రచ్చైంది. జిల్లా విద్యాశాఖాధికారి ద్వార జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జరగాల్సిన డిప్యూటేషన్ లను జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్స్ చేయడం వివాదానికి దారి తీసింది. అనర్హులకు జిల్లా సరిహద్ధులను దాటి కామారెడ్డి నుంచి డిప్యూటేషన్  ఇవ్వడం కలకలం రేపింది. నిజామాబాద్ డైట్ కళాశాలలో డిప్యూటేషన్ లు రాత్రికి రాత్రే నిమిషాల వ్యవధిలో రద్దవడం  విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో పని చేసిన డిఈఓ అక్కడ ఖాళీలను భర్తీ చేసేందుకు డిప్యూటేషన్ లను ఇచ్చిన అవి అమలుకు నోచుకోలేదు. ఇటీవల కొత్త డిఈఓ రాగానే అక్కడ డిప్యూటేషన్ ల పైళ్ ముందుకు కదిలింది. సోమవారం రాత్రికి రాత్రే డిప్యూటేషన్ లు ఇచ్చారు. అందులో ప్రధానంగా అందరు సైన్స్ టీచర్ లను డిప్యూటేషన్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ కుడా సైన్స్ లెక్చరర్ ఉన్న చోట ఐదుగురికి డిప్యూటేషన్ ఎందుకు అనే చర్చ జరుగుతుంది. అయితే ఎస్ జిటి విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు ఎస్ జిటి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేయడం కొత్త చర్చకు దారి తీసింది. ఎంఇడి, పిజి చేసిన ఉపాధ్యాయులను డైట్ లో బోధనకు అర్హులు. కాని డిగ్రీ, బిఇడి చెసిన ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ వేయడం వివాదానికి దారి తీసింది. ఏకంగా కామారెడ్డి నుంచి ఒక ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ వేయడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. 317 జిఓ అమలు కు నోచుకోలేదు, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా దాటి డిప్యూటేషన్ లను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు లేదా జిల్లా కలెక్టర్ ల అనుమతితో జరుగాల్సిన చోట డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇద్దరు విద్యాశాఖాధికారులు డిప్యూటేషన్ ఇవ్వడం పై ఉమ్మడి జిల్లాలో సంబంధిత డిప్యూటేషన్  విద్యాశాఖలో రచ్చైంది. దానితో తప్పును సరిదిద్దుకునేందుకు కామారెడ్డి విద్యాశాఖాధికారులు డిప్యూటేషన్ ను రద్దు చేశారు. సంబంధిత టీచర్  గతంలో డైట్ లో పని చేయడంతోనే అక్కడ పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత డిఇఓ, ప్రిన్సిపాళ్లు అనర్హురాలికి ఎవిధంగా డిప్యూటేషన్ ఇచ్చారని చర్చ జరుగుతుంది. చాత్రోపాధ్యాయులకు బోదన కోసం లెక్చరర్ల నియమాకం జరుగాల్సిన చోట కాసులకు డిప్యూటేషన్ లు ఇవ్వడం, అందున అనర్హులకు ఇవ్వడం ఇప్పుడు విద్యాశాఖాలో చర్చకు దారి తీసింది.