Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:22 pm Posted by : ramakrishna

అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను ముసివేయాలి

 

. . . విద్యార్థి సంఘాల డిమాండ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలో గల అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ పాఠశాలలను మూసి వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లాగా పుట్టుకస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా, పక్కా భవనాలు లేకుండా, రేకుల రూమ్ లలో, క్లాస్ రూమ్ లు నిర్వహించడం వలన వర్షాకాలంలో, ఎండాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అరకొర అసౌకర్యలలో విద్యను ఏ విధంగా బోధిస్తారో తెలియని పరిస్థితి, మరికొన్ని స్కూల్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మంచినీటి సౌకర్యాలు లేవని, 80 శాతం పాఠశాలలకు గ్రౌండ్ సౌకర్యం కూడా లేదన్నారు. అయినప్పటికీ విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకోకుండా విద్యావ్యవస్థను గాలికి వదిలేసినట్టుగా చోద్యం చూస్తున్నారని మండి పడ్డారు. జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే మండలాలల్లో ఎంఈఓ ఆఫీసులు, జిల్లాల్లో డీఈఓ ఆఫీస్ ల ముట్టడికైనా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు, పిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్, ఏఎఫ్ డిఎస్ అధ్యక్షులు ఎండీ మోసిన్, టిఎస్ పి అధ్యక్షులు శ్రీకాంత్, రాజు, అన్న అవధుత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.