జెడ్పీ స్కూల్ ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి ముందే పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే  తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం ప్రార్థనలో పాల్గొన్నారు.