Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 6:23 pm Posted by : ramakrishna

మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ఆకస్మిక తనిఖీ 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను గురువారం ఎమ్మార్వో శివప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారం భోజనం అందించాలన్నారు. నిత్యవసర సరుకులను నిల్వలను మరియు కూరగాయల నాణ్యత పరిమాణాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెస్ చుట్టుపక్కల ఉన్న చెత్తాచెదారాలను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Unannounced inspection of Mahatma Jyotibapule School