Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 6:35 pm Posted by : ramakrishna

అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ

నిజాంసాగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలం సుల్తానగర్ గ్రామపంచాయతీని, నర్వ గ్రామపంచాయతీ లోని  అంగన్వాడి సెంటర్ ను మంగళవారం ఎంపీడీఓ గంగాధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో  గంగాధర్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన  పోషకాహారం, గుడ్లను అందించాలని తెలిపారు. అనంతరం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్ల  సర్వేలో పాల్గొని  లబ్ధిదారుల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో నర్వ గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాముడు, సుల్తాన్ నగర్  కార్యదర్శి రవి రాథోడ్, కరోబార్ ప్రభాకర్ లో ఉన్నారు.