Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 5:18 pm Posted by : ramakrishna

ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ నూతన పాలకవర్గ ఎన్నిక సోమవారం పూర్తయింది. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ గా అవకాశం ఏకగ్రీవంగా సీమ శెట్కార్ కు దక్కింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ కు ఏకగ్రీవంగా అవకాశం దక్కింది. మిగిలిన పదిమంది కౌన్సిలర్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ఎన్నికల అధికారి చందర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ శాసనసభ సభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు బిచ్కుంద తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ హయ్యూం, బిచ్కుంద ఎస్ఐ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

Unanimously, the Municipal Chairman and Vice Chairman