ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఏకగ్రీవ ఎన్నికలు

  . . . చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్‌గా మత్తమల భాగ్యవతి ఎన్నిక   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్‌గా మత్తమల భాగ్యవతి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతూ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు....