Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 6:02 pm Posted by : ramakrishna

రెండు గ్రామాలలో ఏకగ్రీవం

  • గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన పాలకవర్గం…

 

బతుకమ్మ, కోటగిరి : సర్పంచ్ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం నాటికి ముగియండంతో పలు గ్రామాలు తమ అభివృద్ధి కొరకై ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కస్ పల్లి, రాంపూర్ గ్రామాలలో సర్పంచ్ వార్డ్ నెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అడ్కస్  పల్లి గ్రామంలో రెండవ సారి గ్రామ సర్పంచ్ గా రెడ్డి రామ కృష్ణ తో పాటు వార్డ్ సభ్యులు గా .1వ వార్డ్ శోభ,2 వ వార్డ్ ఆర్.లక్ష్మణ్,3 వ వార్డ్ నువ్వురి బాలరాజ్,4 వ వార్డ్ చుండ్రు.మహిత,5 వ వార్డ్ వల్లూరి లక్ష్మీ గణేశ్వరావు,6 వ వార్డ్ షేక్ జాకీర్ లు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోగా  రాంపూర్ గ్రామాలలో ఎస్టీ జనరల్ రిజర్వేషన్ రావడంతో  గ్రామ సర్పంచ్ గా ఇస్లావత్ సాంకి బాయితో పాటు 1వ వార్డ్ బి.లచ్చిరాం,2 వ వార్డ్ అనిత,3 వ వార్డ్ కే. అనిల్,4 వ వార్డ్ సిహెచ్ చిన్న సాయిలు,5 వ వార్డ్ కే.సంధ్య శ్రీ,6 వ వార్డ్ ఎడ్ల లక్ష్మి,7 వ వార్డ్ జె.గీతారాణి,8 వ జి.లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో  గ్రామాలలో సంబరాలు జరుపుకున్నారు. తమపై నమ్మకంతో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు  గ్రామస్తులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో  గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపేందుకు  అహర్నిశలు కష్టపడతామని హర్షం వ్యక్తం చేశారు.

Unanimity in two villages